
బిజినెస్

తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ స్థాపించిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చిన స్టార్ హీరో విజయ్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా తన సింపుల్ నైజాన్ని కొనసాగిస్తున్నారు. హీరోగా ఉన్నప్పుడే సాధారణ జీవనశైలిని అనుసరించిన ఆయన, సీఎం అయిన తర్వాత కూడా ఎక్కడా అధికార గర్వం చూపించకుండా ప్రజలకు చేరువగా ఉండే విధంగా పాలన సాగిస్తున్నారు.
తాజాగా కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా ఆలయాన్ని దర్శించిన విజయ్, అనంతరం ఆశ్చర్యకరంగా తన కాన్వాయ్‌లో ప్రయాణించే కారును స్వయంగా డ్రైవ్ చేశారు. ఆలయం నుంచి మంగళూరు విమానాశ్రయం వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరం ఆయన కారు నడిపారు. మార్గమధ్యంలో టోల్ గేట్ వద్ద అభిమానులను గమనించి చిరునవ్వుతో వారికి అభివాదం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!