
జనరల్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జూన్ 11న అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఇందిరా భవన్లో ఉదయం 11:30 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌ఛార్జులు, పీసీసీ అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
ఈ సమావేశానికి సంబంధించిన సర్క్యులర్‌ను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ నేపథ్యంలో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీకి సంబంధించిన కీలక రాజకీయ, సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!