

ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు విధించిన అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయన అనర్హత అమల్లోకి వచ్చినట్లు స్పష్టమైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది.
తీర్పు అనంతరం దానం నాగేందర్ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. న్యాయపరంగా పోరాడటంలో ఎలాంటి తప్పు లేదని, అందుకే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానని చెప్పారు. సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడే ఈ పరిణామాన్ని ఊహించానని పేర్కొన్నారు. మళ్లీ ప్రజల మధ్యకు వెళ్లి ఎన్నికల్లో పోటీ చేస్తానని, నియోజకవర్గానికి పరిమితమై అభివృద్ధి, ప్రజా సమస్యలపై పనిచేస్తానన్నారు. తాను ఎవరినీ కలవలేదని, కోర్టు తీర్పు కోసం ఎదురుచూశానని తెలిపారు. ఉప ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీ పరంగా ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ప్రజల మధ్య ఉండటం తనకు బలమని, ప్రజల ఆశీస్సులు మళ్లీ ఉంటాయని దానం నాగేందర్ పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!