
క్రీడలు

మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. తనపై చిన్ని చేసిన ఆరోపణలకు స్పందించిన కేశినేని నాని, విలేకరుల సమావేశంలో అసత్య కథనాలు చెప్పారని విమర్శించారు. తన అప్పులు, ఆస్తులు, ఆదాయం గురించి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని ఆయన అన్నారు.
తన ఆర్థిక లావాదేవీలపై నిజంగా అనుమానాలు ఉంటే ప్రధానమంత్రి, హోంమంత్రి, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లవచ్చని, పార్లమెంట్లో ప్రస్తావించవచ్చని నాని పేర్కొన్నారు. అలాగే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చేయవచ్చని అన్నారు. అవేమీ చేయకుండా విలేకరుల సమావేశాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రజలు అలాంటి ఆరోపణలను నమ్మరని వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!