

సీషెల్స్ అత్యున్నత పురస్కారం 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్'ను ప్రధాని నరేంద్ర మోదీ అందుకోవడంపై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ అవార్డు కావాలనే ఇప్పించుకున్న గౌరవమని ఆయన చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఖండించారు. అవగాహన లేని అంశాలపై నిరాధార వ్యాఖ్యలు చేస్తూ కాలం గడుపుతున్నారని, అసూయతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఘాటుగా స్పందించారు.
ఇతరుల విజయాలపై అసూయ ఎప్పటికీ మంచి ఫలితాలను ఇవ్వదని, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారిలో అలాంటి ధోరణి మరింత ఎక్కువగా ఉంటుందని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇటీవల సీషెల్స్ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆ దేశ అత్యున్నత పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా నిలిచారు. మోదీ పర్యటనకు ముందే, జూన్ 24న సీషెల్స్ మంత్రివర్గం ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడానికి అధికారికంగా ఆమోదం తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!