

ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. విజయనగరం జిల్లా రాజాం టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, విద్య, సమాచార సాంకేతికత, నీటిపారుదల, మౌలిక వసతుల రంగాల్లో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్ర అభివృద్ధిని ప్రశంసించారని తెలిపారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసినా పూర్తి చేయలేకపోయారని, ఐదేళ్ల పాలనలో పెద్దగా పనులు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర పరువును దిల్లీలో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, భవిష్యత్‌లో ప్రజలు తగిన తీర్పు ఇస్తారని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!