
సినిమాలు

అంగన్‌వాడీ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పే ప్రభుత్వం, 62 వేల మంది అంగన్‌వాడీ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలను గణనీయంగా పెంచడంతో పాటు వారి గౌరవాన్ని పెంచే చర్యలు చేపట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ప్రకటించిన వేతన పెంపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలు ఇప్పటికీ అమలుకాలేదని విమర్శించారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!