

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఐక్యరాజ్యసమితి వేదికగా ఇరుదేశాల నేతలు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల మధ్య జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రంలోని 58 సెకన్ల యాక్షన్ సన్నివేశాన్ని షేర్ చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేస్తామని చేసిన వ్యాఖ్యలకు స్పందించింది.
‘‘ఇరాన్‌ను నాశనం చేయడం గురించి ట్రంప్ మాట్లాడుతున్నారు. అయితే ఇరాన్ రక్షణలేని దేశం కాదని ఆయనకు తెలుసు’’ అంటూ ఎంబసీ వ్యంగ్యంగా పేర్కొంది. హాలీవుడ్‌కు బదులుగా ప్రస్తుతం భారతీయ సినిమాలు చూస్తున్నారంటూ తన పోస్టులో వ్యాఖ్యానించింది. అయితే ఎంబసీ ‘బాలీవుడ్’గా పేర్కొన్న ఈ సన్నివేశం వాస్తవానికి తెలుగు చిత్రం ‘భగవంత్ కేసరి’లోనిది. బాలకృష్ణ పాత్ర సాయుధ వ్యక్తులను ఎదుర్కొనే సన్నివేశం కావడంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!