

కే.టి. రామారావు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నీట్ యూజీ-2026 పరీక్షల వివాదం, పేపర్ లీకేజీ ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మలేషియా పర్యటనకు ముందు హైదరాబాద్‌లో నీట్ బాధితులు, లాంగ్‌టర్మ్ విద్యార్థులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కష్టపడి చదివిన విద్యార్థులు వ్యవస్థ వైఫల్యానికి బలికావడం అన్యాయమని అన్నారు.
విద్యార్థుల సమస్యలను విన్న కేటీఆర్, ఈ అంశాన్ని పార్లమెంట్‌తో పాటు ఇతర చట్టసభలలో కూడా బలంగా ప్రస్తావిస్తామని హామీ ఇచ్చారు. పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వివాదాలు, పరీక్షల నిర్వహణలోని లోపాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగాలని, ఒత్తిడిని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని ఆయన సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!