

హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులకు మద్దతుగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొననున్నారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ధర్నాలో వెయ్యి మందికి మించి పాల్గొనకూడదని, మధ్యాహ్నం 2 గంటలలోపు కార్యక్రమాన్ని ముగించాలని స్పష్టం చేశారు.
అలాగే నిరసనకారులు సచివాలయం, అసెంబ్లీ వైపు వెళ్లరాదని, మైక్‌లు, సౌండ్ సిస్టమ్ వినియోగం కూడా నిర్దేశిత శబ్ద పరిమితుల్లోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. అనుమతిలో పేర్కొన్న అన్ని నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అయితే విద్యార్థులకు మద్దతుగా నిర్వహిస్తున్న ప్రజాస్వామ్య నిరసనకు ఇలాంటి కఠిన ఆంక్షలు విధించడం సరికాదని బీఆర్ఎస్ నేతలు విమర్శించగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!