

బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రో రైలును 400 కిలోమీటర్ల వరకు విస్తరిస్తామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీలు మెట్రో పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. లక్డీకాపూల్ నుంచి బిహెచ్ఈఎల్ వరకు మెట్రో ప్రాజెక్టుకు బీజేపీ గతంలో అనుమతి ఇవ్వలేదని అన్నారు. అలాగే అవసరం లేని రూ.14 వేల కోట్ల ఎల్ అండ్ టీ అప్పును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై మోపాలని చూస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఎయిర్‌పోర్ట్ మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని, మరో రెండున్నరేళ్లు ఇదే విధంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ఇక ఆదిలాబాద్ జిల్లాలో సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయంపై కూడా కేటీఆర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే కేంద్రం సానుకూలంగా ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే సీసీఐ మళ్లీ స్థాపించవచ్చని పేర్కొన్నారు. సీసీఐ సాధన సమితి పోరాటం ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఆలస్యం జరిగితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!