
సినిమాలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి కీలక పారిశ్రామిక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీ పునరుద్ధరణ అంశాన్ని ప్రస్తావించనున్నారు.
ఈ బృందంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఖానాపూర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జాన్సన్ నాయక్, సీసీఐ సాధన సమితి నాయకులు పాల్గొంటున్నారు. ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరనున్నారు. అనంతరం ఢిల్లీలో నిర్వహించే మీడియా సమావేశంలో కేటీఆర్ పాల్గొననున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!