
గాసిప్స్

తన కూతురు తనను కోర్టుకు తీసుకెళ్తోందంటూ నటి సమీరా రెడ్డి చేసిన సరదా వ్యాఖ్య ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో పిల్లలు సాధారణంగా తల్లిదండ్రులను స్కూల్ కార్యక్రమాలకు లేదా పార్టీలకు తీసుకెళ్తారని చెబుతూ, తన కూతురు నైరా మాత్రం కోర్టుకు తీసుకెళ్తోందని సరదాగా చెప్పడంతో అభిమానులు నవ్వుల్లో మునిగిపోయారు. అనంతరం ఇది కేవలం ఫన్ వీడియో మాత్రమేనని స్పష్టమైంది.
సమీరా రెడ్డి, ఆమె భర్త అక్షయ్ వర్దే తమ పిల్లలు హన్స్, నైరాతో కలిసి గడిపే మధుర క్షణాలను తరచుగా సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు. 13 ఏళ్ల విరామం తర్వాత ఆమె ‘చిమ్నీ’ అనే హారర్ థ్రిల్లర్‌తో మళ్లీ నటిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో తన కూతురిని రక్షించేందుకు పోరాడే తల్లి పాత్రలో ఆమె కనిపించనుండగా, ఈ సినిమాపై కూడా మంచి ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!