
జనరల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ప్రతినిధుల సభలో గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్‌పై అమెరికా చేపట్టే సైనిక చర్యలను నిలిపివేయాలని కోరుతూ తీసుకొచ్చిన తీర్మానాన్ని ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 215 ఓట్లు, వ్యతిరేకంగా 208 ఓట్లు రావడంతో అది స్వల్ప మెజారిటీతో ఆమోదం పొందింది.
తీర్మానానికి మద్దతు తెలిపిన సభ్యులు ఇరాన్‌తో దీర్ఘకాలిక ఘర్షణ అమెరికాకు భారీ ఆర్థిక భారం మోపడంతో పాటు ప్రాణనష్టానికి దారితీసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. అనవసరమైన మరియు ఖర్చుతో కూడిన యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని వారు డిమాండ్ చేశారు. సైనిక చర్యల కంటే దౌత్యపరమైన పరిష్కారాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సభ్యులు స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!