
క్రీడలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వేతనాల కోడ్ , 2019 ఉద్యోగులకు జీత భద్రత కల్పించే కీలక చట్టంగా మారనుంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాల్సిన బాధ్యతను యజమానులపై ఈ చట్టం స్పష్టంగా ఉంచింది. జీతం ఆలస్యం చేయడం, అనుమతి లేకుండా కోతలు విధించడం వంటి అంశాలపై ఉద్యోగులు అధికారులను ఆశ్రయించే అవకాశం కల్పించింది.
వేతనాల కోడ్ ప్రకారం నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు తదుపరి నెల 7వ తేదీలోపు వేతనం చెల్లించాలి. ఉద్యోగం మానేసినా, తొలగించినా తుది బకాయిలను రెండు పని దినాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. జీతం ఎంత ఉన్నా ఉద్యోగులందరికీ ఈ రక్షణ వర్తిస్తుంది. జీతం ఆలస్యమైతే ఉద్యోగులు ఇన్‌స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!