
సినిమాలు

బహదూర్‌గూడలో 650 ఎకరాల భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఫెన్సింగ్ ఎలా వేస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం, అదే రోజు కోర్టుకు హాజరుకావాలని రంగనాథ్‌ను ఆదేశించింది. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించడంతో హైడ్రా కమిషనర్ వెంటనే కోర్టుకు హాజరయ్యారు.
ఇదే కేసులో రేవంత్ సర్కార్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బహదూర్‌గూడ సర్వే నంబర్లు 3, 4లోని 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, బహదూర్‌గూడ భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!