
సినిమాలు

అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిని మంత్రులు నారాయణ, అనగాని సత్య ప్రసాద్, సవిత పరిశీలించారు. ఐకానిక్ టవర్స్, మంత్రుల బంగ్లాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రులు.. పనులు జరుగుతున్న తీరును సమీక్షించారు. నిర్మాణాల పురోగతిపై మంత్రి నారాయణ సహచర మంత్రులకు వివరించారు.
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు తెలిపారు. అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా అందించారని మంత్రి సవిత పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు చేసిన ఆమె.. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అమరావతిని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలను త్వరలో GADకు అప్పగించనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!