

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెడుతోందని, జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధిరేటు సాధించామని ప్రభుత్వం చెబుతున్న మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10.7 శాతం వృద్ధిరేటు నమోదైందంటూ ప్రచారం చేసుకోవడం కంటే, నిరుద్యోగం, రైతుల సమస్యలు, శాంతిభద్రతలు, విద్యుత్ ఛార్జీలు, పోలవరం, పెట్టుబడులు వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో రైతులకు పంటలకు మద్దతు ధర, ప్రభుత్వ సహాయం అందడం లేదని, శాంతిభద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.5 మీటర్లకు పరిమితం చేయడం, విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలపై భారం పడటం, పెట్టుబడులపై స్పష్టమైన వివరాలు వెల్లడించకపోవడం వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. ఇవి తన వ్యక్తిగత విమర్శలు కాదని, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలని పేర్కొంటూ, కూటమి ప్రభుత్వం వృద్ధిరేటుపై ఆత్మవిమర్శ చేసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!