
సినిమాలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విడుదల చేసిన ప్రగతి నివేదికను ఆమె “ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్”గా అభివర్ణించారు. అభివృద్ధి, సంపద సృష్టి, సమతుల్యత, సంక్షేమం అనే నాలుగు సూత్రాలు పూర్తిగా విఫలమయ్యాయని, ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెన్షన్లు, నిరుద్యోగ భృతి, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు. పెరుగుతున్న అప్పులు, పెట్టుబడులపై అసత్య ప్రచారం, ఆర్థిక అసమతుల్యతపై కూడా ఆమె ప్రశ్నించారు. రెండేళ్ల పాలన మోసాలు, మాటల గారడీలతో నిండిపోయిందని షర్మిలా విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!