

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నందినగర్ నివాసంలో ఎస్‌ఐఆర్ కమిటీతో సమీక్ష నిర్వహించి, కార్యక్రమాల పురోగతి మరియు క్షేత్రస్థాయి సమస్యలను విశ్లేషించారు. ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కార్యకలాపాల వివరాలను అందించింది. ఓటర్ల పూర్తి వివరాలు లేకపోవడం వల్ల అనేక మందిని నోటీసుల విభాగంలో చేర్చిన నేపథ్యంలో, అర్హులైన వారి పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు మార్గనిర్దేశం చేయాలని కేటీఆర్ సూచించారు.
అర్హులైన ఒక్క ఓటరు కూడా మిస్ కాకూడదని, అదే సమయంలో డూప్లికేట్ లేదా అనర్హ ఓటర్లు జాబితాలో ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆగస్టు 3 వరకు నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని, ఆగస్టు 10న డ్రాఫ్ట్ జాబితా వచ్చిన తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి వరకు సమన్వయంతో పనిచేసి ఖచ్చితమైన ఓటరు నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!