

దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. సెప్టెంబర్ 6న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లు తలపడనున్నాయి. తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్‌కు మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్ చేరడంతో జట్టు మరింత బలపడింది. అయితే కేఎల్ రాహుల్ ఫైనల్‌కు దూరంగా ఉండనున్నాడు. ఫైనల్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో తిలక్ వర్మ మాట్లాడుతూ.. మహ్మద్ షమీ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు తమ బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత మ్యాచ్‌లో షమీ బౌలింగ్‌ను పరిశీలించామని, అతడి లైన్ అండ్ లెంగ్త్‌ను ఎదుర్కొంటూ సత్తా చాటుతామని చెప్పారు.
మరోవైపు ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ షమీపై ప్రశంసలు కురిపించాడు. షమీ అత్యుత్తమ ఆటగాడని, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని పేర్కొన్న ఇషాన్.. ఇప్పటికీ అతడిలో వికెట్లు తీయాలనే ఆకలి తగ్గలేదన్నారు. సెమీఫైనల్లో షమీ కీలక ప్రదర్శనతో ఈస్ట్ జోన్ ఫైనల్‌కు చేరగా, వైభవ్ సూర్యవంశీ కూడా తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్‌ను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వీక్షించనున్న నేపథ్యంలో పలువురు ఆటగాళ్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!