

ఆడియో ఉత్పత్తులతో గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్‌కు చెందిన భారతీయ టెక్ బ్రాండ్ మివి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతోంది. సంస్థ తన తొలి స్మార్ట్‌ఫోన్‌కు ‘మివి వన్ 5జీ’ అనే పేరును ఖరారు చేసింది. సెప్టెంబర్ 24న భారత్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. టీజర్‌లో గ్రీన్ కలర్ వేరియంట్‌తో పాటు వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 5జీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించనున్నట్లు సంస్థ వెల్లడించినప్పటికీ, పూర్తి స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు.
ధర విషయంలోనూ మివి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజా నివేదికల ప్రకారం రూ.15 వేలలోపు ధర విభాగంలో మివి వన్ 5జీను తీసుకురావచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ విక్రయించనున్నారు. మిధుల దేవభక్తుని, విశ్వనాధ్ కందుల స్థాపించిన మివి ఇప్పటివరకు ఇయర్‌బడ్స్, స్పీకర్లు, సౌండ్‌బార్స్ వంటి ఆడియో ఉత్పత్తులతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆడియో రంగం నుంచి స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెడుతున్న సంస్థల జాబితాలో మివి కూడా చేరింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!