18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

Writer: Chandrika 10:53 PM, 18 సెప్టెంబర్, 2026
మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను తమ ప్రభుత్వం ప్రజాస్వామికంగా నిర్వహించిందని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సభలో చర్చించామని చెప్పారు. స్పీకర్ ప్రతి సభ్యుడికి మాట్లాడే అవకాశం కల్పించారని, శాసనసభ్యులంతా వివిధ అంశాలపై చర్చల్లో పాల్గొన్నారని వివరించారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు మొత్తం 51 గంటల 52 నిమిషాలు కొనసాగాయని తెలిపారు. 50 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయని, 86 మంది సభ్యులు అనుబంధ ప్రశ్నలు అడిగారని, 105 మంది సభ్యులు వివిధ అంశాలపై మాట్లాడారని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు ప్రకటనలు చేశారని, పలు బిల్లులు ఆమోదించడంతో పాటు స్వల్పకాలిక చర్చలు కూడా జరిగాయని వివరించారు.

అసెంబ్లీ కార్యకలాపాలకు బీఆర్ఎస్ సభ్యులు అంతరాయం కలిగించారని శ్రీధర్ బాబు విమర్శించారు. సభా నియమాలను ఉల్లంఘిస్తూ నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లారని ఆరోపించారు. పలు రోజుల నిరసనల అనంతరం 22 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అలాగే స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను కూడా శాసనమండలి నుంచి సస్పెండ్ చేశారు. 22-ఏ భూముల అంశంపై ప్రభుత్వం సభలో చర్చకు ముందుకొచ్చిందని, సమస్యల పరిష్కారానికి హైపవర్ అధికారుల కమిటీని ఏర్పాటు చేశామని శ్రీధర్ బాబు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి హాజరై తన అనుభవంతో సూచనలు ఇస్తారని ఆశించామని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హరీశ్ రావు స్పందన

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

క్రిశాంక్ అరెస్ట్‌పై కేటీఆర్ ఘాటు స్పందన

ట్యాగ్లు
దుద్దిళ్ల శ్రీధర్ బాబుతెలంగాణ అసెంబ్లీతెలంగాణ రాజకీయాలుతెలంగాణ ప్రభుత్వంఅసెంబ్లీ సమావేశాలుసీఎల్పీ మీడియా పాయింట్బీఆర్ఎస్రేవంత్ రెడ్డి22-ఏ భూములుతెలంగాణ శాసనసభ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..
జనరల్

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా..

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..
జనరల్

శ్రీవారి లడ్డూ నెయ్యి కేసులో కీలక మలుపు..

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం -  మంత్రి శ్రీధర్ బాబు
రాజకీయాలు

మా ప్రభుత్వం ప్రజాస్వామిక ప్రభుత్వం - మంత్రి శ్రీధర్ బాబు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..
సినిమాలు

శోభిత ధూళిపాళ్లపై దర్శకుడు పా. రంజిత్ ప్రశంసల వర్షం..

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ రిలీజ్..

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
సినిమాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు
సినిమాలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!
సినిమాలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!
సినిమాలు

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!