
బిజినెస్

నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలను ఆయన అసిస్టెంట్ ఖండించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ' సినిమా షూటింగ్ సందర్భంగా రాజేష్ శర్మ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అనంతరం ఆయనను వైద్య చికిత్స కోసం కోల్‌కతాకు తరలించినట్లు వెల్లడించారు.
డయాబెటిస్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యల కారణంగానే రాజేష్ శర్మను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన అసిస్టెంట్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రేపు ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశముందని వెల్లడిస్తూ, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!