
జనరల్

సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ స్పందించారు. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్‌ను తెప్పించామని, వాటిని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తోందని తెలిపారు. కమిటీ పరిశీలన పూర్తయిన తర్వాత ఆ వీడియో క్లిప్పింగ్స్‌ను ఏఐసీసీకి పంపిస్తామని వెల్లడించారు. చిన్నారెడ్డి సీనియర్ మోస్ట్ నాయకుడని పేర్కొన్నారు.
చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇచ్చిన ఫిర్యాదును కూడా స్వీకరించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, అనిరుద్ రెడ్డికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించే వారు ఎవరైనా, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!