4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

Writer: G.Sreekanth Reddy 09:05 AM, 4 నవంబర్, 2026
సొంత ఖర్చుతోనే సింధు, లక్ష్యసేన్‌ విజయాలు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ యూరప్‌ పర్యటనలో టైటిళ్లు గెలిచి సత్తా చాటారు. అయితే ఆ టోర్నీలకు వెళ్లేందుకు అవసరమైన ఖర్చుల విషయంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, జర్మనీల్లో జరిగిన నాలుగు టోర్నీలకు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) నిధులు విడుదల చేయలేదని సమాచారం. 'ఇండియన్ ఎక్స్ ప్రెస్'ను ఉటంకిస్తూ ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. ప్రయాణం, భోజనం, వసతి ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి వచ్చింది. నిధులు అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సింధు.. కొంత ఖర్చును తానే భరించానని, ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌ సంస్థ కూడా సాయం చేసిందని తెలిపింది.

నిధుల కొరత ప్రభావం ఆటగాళ్ల సహాయక సిబ్బందిపైనా పడింది. కోచ్‌ల ఖర్చులు భరించలేక కొందరు వారిని వెంట తీసుకెళ్లలేకపోయారు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అష్మితా చాలిహా, డెన్మార్క్‌ ఓపెన్‌లో తన్వీ శర్మ కోచ్‌ సహాయం లేకుండానే పోటీపడ్డారు. నిధులు నిలిచిపోవడానికి కారణంపై భిన్న కథనాలు వెలువడ్డాయి. ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్‌ జట్టు ప్రదర్శన దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అనుమానించినా.. ఆ వాదనను సాయ్‌ అధికారి ఖండించారు. టోర్నీలకు 30 రోజుల ముందుగా సమర్పించాల్సిన ప్రతిపాదనను బ్యాడ్మింటన్‌ సంఘం (బీఏఐ) గడువులోగా ఇవ్వకపోవడంతో నిధులు విడుదల కాలేదని వివరించారు. 

నిధుల ఇబ్బందుల నేపథ్యంలోనూ భారత ఆటగాళ్లు మంచి ఫలితాలు సాధించారు. జర్మనీలో జరిగిన హైలో ఓపెన్‌లో లక్ష్యసేన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలవగా, సింధు మహిళల సింగిల్స్‌ విజేతగా నిలిచింది. ఈ ఏడాది ఆమెకు ఇది రెండో టైటిల్‌. మరోవైపు, రాబోయే టోర్నీలకు నిధుల సాయం పునరుద్ధరిస్తామని సాయ్‌ తెలిపినట్లు ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ పేర్కొంది. అయితే యూరప్‌ పర్యటనలో ఆటగాళ్లు స్వయంగా పెట్టుకున్న ఖర్చులను తిరిగి చెల్లించబోమని స్పష్టం చేసినట్లు తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

కివీస్‌తో వన్డే పోరుకు టీమ్‌ఇండియా రెడీ.. రో-కో జోడీపై భారీ అంచనాలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు నిధుల కష్టాలు..సింధు కీలక వ్యాఖ్యలు

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

ప్రపంచకప్ ఫైనల్ టికెట్ల కోసం భారీ పోటీ

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

న్యూజిలాండ్ గడ్డపై వన్డేల్లో టీమ్‌ఇండియా రికార్డులివే!

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

హార్దిక్‌ పాండ్య రీఎంట్రీపై గిల్‌ కీలక అప్‌డేట్‌..

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ఐపీఎల్ 2027కు ముందు బిగ్ ట్రేడ్.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్?

ట్యాగ్లు
యూరప్‌ పర్యటనసాయ్‌ఆసియాపీవీ సింధుభారత బ్యాడ్మింటన్‌లక్ష్యసేన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!
క్రీడలు

డబుల్ సెంచరీతో సీఎస్‌కే బ్యాటర్ ఉర్విల్ పటేల్ విధ్వంసం!

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?
సినిమాలు

ఎల్లమ్మలో వేణు చూపించబోయే యాక్షన్ ఎంత?

ఏపీకి మరో తుఫాను ముప్పు..
జనరల్

ఏపీకి మరో తుఫాను ముప్పు..

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?
సినిమాలు

రామాయణ.. ధురంధర్ రికార్డును అధిగమిస్తుందా?

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?
గాసిప్స్

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్
షోస్

బిగ్‌బాస్ 10 ఓటింగ్‌లో ముఖేష్ టాప్.. చివరి స్థానాల్లో నీతూ, రామ్ ప్రసాద్

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు
సినిమాలు

పవన్ కల్యాణ్, షారుఖ్ ఖాన్ ఒకే షాపింగ్ మాల్‌లో.. రేణు దేశాయ్ ఆసక్తికర విషయాలు

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు
జనరల్

దీపావళి సందర్భంగా చెన్నై సెంట్రల్‌-చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

అల్లు అరవింద్‌తో కలిసి నటించాలనుంది.. జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?
బిజినెస్

ల్యాబ్‌లో బంగారం తయారీ సాధ్యమైతే ధరలు తగ్గుతాయా?

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

సదర్ ఉత్సవాలు యాదవుల ఆత్మగౌరవానికి ప్రతీక: సీఎం రేవంత్ రెడ్డి

బిగ్‌బాస్ హౌస్‌లో మాటల మంటలు.. వర్షిణి, ముకేశ్‌లకు ఎదురైన విమర్శలు!
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో మాటల మంటలు.. వర్షిణి, ముకేశ్‌లకు ఎదురైన విమర్శలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!