
ఓటీటీ

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో నేడు కీలక విచారణ జరగనుంది. ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జరిగే విచారణపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, దేవదత్ కామత్ వాదనలు వినిపించనున్నారు. సుప్రీంకోర్టు విచారణలో వెలువడే నిర్ణయం ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన తదుపరి పరిణామాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసులో న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై ప్రభుత్వం, రిజర్వేషన్ల అంశంతో సంబంధం ఉన్న వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!