

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వరుస కీలక తీర్మానాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రగీతం, నీట్ అంశాల తర్వాత తాజాగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)పై తీర్మానాన్ని తీసుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయానికి మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను అలాగే కొనసాగించాలని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
జనాభా నియంత్రణలో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు విజయవంతమయ్యాయని సీఎం విజయ్ అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి కేటాయించిన సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమిళనాడు తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!