
సినిమాలు

తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వినూత్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించే ప్రతి బిడ్డకు ఉచితంగా ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని అందించే ‘తాయా మామన్ తంగ మోదిరమ్ తిట్టమ్’ (మేనమామ బంగారు ఉంగరం పథకం)ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకానికి సంబంధించిన అధికారిక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.755.83 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, నవజాత శిశువుల కుటుంబాలకు గుర్తుండిపోయే కానుక అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!