
టెక్నాలజీ

పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కంది శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డిల మధ్య చోటుచేసుకున్న విభేదాల నేపథ్యంలో సంజీవరెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది.
ఇదే సమయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, జూపల్లి మల్లారెడ్డికి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. నర్సారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. నోటీసులకు నేతలు వివరణ ఇవ్వాల్సి ఉండగా, ఫిర్యాదులు, ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ తదుపరి చర్యలను పరిశీలించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!