

నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమాపై అభిమానుల్లో ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కనున్న తొలి చిత్రాన్ని సరిగ్గా రెండేళ్ల క్రితం ప్రకటించారు. అయితే కొన్ని కారణాలతో ఆ ప్రాజెక్ట్ తర్వాత నిలిచిపోయింది. తాజాగా మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆయన డెబ్యూ మూవీపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. అభిమానులకు విజువల్ ట్రీట్‌గా త్వరలో చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
విశ్వంభర చిత్రానికి దర్శకత్వం వహించిన వశిష్ఠ ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సింబా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కథానాయికగా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అధికారిక ప్రకటనతో నటీనటులు, సాంకేతిక బృందం, టైటిల్ తదితర వివరాలపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!