
జనరల్

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంపై ఎంపీ మల్లు రవి స్పందించారు. శనివారం మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావుతో కలిసి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం కొల్లాపూర్‌లో జరిగిన సభలో మాట్లాడారు.
మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వల్ల రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉన్నందునే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్యలు తీసుకున్నామని మల్లు రవి తెలిపారు. బీసీ మహిళపై చర్యలు తీసుకున్నారంటూ భారాస నేతలు విమర్శిస్తున్నారని, అయితే వారి హయాంలో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదని ఆరోపించారు. దళిత నేత రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిన చరిత్ర భారాసదేనని విమర్శించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!