

తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలు కల్యాణ్ బెనర్జీ, సౌగతా రాయ్, మహువా మోయిత్రాలకు లీగల్ నోటీసులు పంపారు. బరసత్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి తాను పార్టీ టికెట్ కోరినట్లు చేసిన ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పందించకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇటీవల జరిగిన కార్యక్రమంలో మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. తనకు రాజకీయ పదవులపై ఎలాంటి ఆసక్తి లేదని, టికెట్ కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని బైద్యనాథ్ ఘోష్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో టీఎంసీలో పునర్వ్యవస్థీకరణ చేపట్టిన పార్టీ అధిష్ఠానం, సయోని ఘోష్ స్థానంలో అర్నబ్ బెనర్జీని యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించింది. అలాగే తృణమూల్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అలీఫా అహ్మద్‌ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!