
గాసిప్స్

ఇరాన్లో ఉన్న అమెరికా పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లాలని అమెరికా వర్చువల్ ఎంబసీ తాజా భద్రతా హెచ్చరిక జారీ చేసింది. ఎలాంటి కారణంతోనూ ఇరాన్‌కు ప్రయాణించవద్దని అమెరికా పౌరులకు సూచించింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితి సంక్లిష్టంగా ఉందని, ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.
ఇరాన్లో విమానాల రద్దు, గగనతల మూసివేత, ఇతర ప్రయాణ అంతరాయాలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా అమెరికా హెచ్చరించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తుతం ఇరాన్‌కు లెవల్ 4 ‘డూ నాట్ ట్రావెల్’ హెచ్చరికను కొనసాగిస్తోంది. ఉగ్రవాదం, అశాంతి, కిడ్నాప్, అమెరికా పౌరుల అక్రమ లేదా అన్యాయ నిర్బంధం వంటి ప్రమాదాలను ఇందుకు కారణాలుగా పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!