
ఆరోగ్యం

నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు విమర్శించారు. జాబ్ క్యాలెండర్, భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధికి మద్దతు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. రెండేళ్లు గడిచినా యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని ఆరోపించారు.
సరూర్‌నగర్ స్టేడియంలో హైడ్రా ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని రాంచందర్‌రావు ఖండించారు. నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధికి రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాల హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు. హైడ్రాలో కేవలం 150 ఉద్యోగ ఖాళీలకు వేలాది మంది యువత తరలిరావడం రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను చూపుతోందన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!