

పెద్దపల్లి జిల్లా పర్యటనలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. సీఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్న ఆరోపణలను ఖండించారు. ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు తగిన సమాధానం ఇచ్చారని, కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో విశ్వాసం కొనసాగుతోందని పేర్కొన్నారు.
భూముల ధరలు, పోలీసు సంక్షేమం, పరిపాలన అంశాలపై హరీష్ రావు చేసిన విమర్శలను శ్రీధర్ బాబు తప్పుబట్టారు. పోలీసుల హక్కులు, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సహజమని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించే అధికారులకు ప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!