

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో భాగమైన ‘అగ్నిపరీక్ష సీజన్ 2’ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలకు మంచి స్పందన లభించగా, కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు బిగ్‌బాస్ టీమ్ ‘ఫ్లేమ్ టూర్’ను ప్రారంభించింది. విజయనగరంలో బిగ్‌బాస్ సీజన్ 9 టైటిల్ విజేత కళ్యాణ్ పడాల ఈ టూర్‌ను ప్రారంభించారు. అనంతరం ఫ్లేమ్ టూర్ విశాఖపట్నానికి చేరుకోగా, సీజన్ 9 ఫైనలిస్ట్ డెమాన్ పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
‘అగ్నిపరీక్ష’లో పాల్గొనే వారికి టాస్కులతో పాటు సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం అవసరమని డెమాన్ పవన్ అన్నారు. ఈ కార్యక్రమానికి నవదీప్, అభిజీత్, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరించనుండగా, మరో బిగ్‌బాస్ ఫైనలిస్ట్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించనుంది. సీజన్ 2లో సుమారు 15 మంది పార్టిసిపెంట్లు అగ్నిపరీక్షలో పాల్గొననున్నారు. వీరిలో 8 నుంచి 10 మందిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపే అవకాశం ఉంది. గత సీజన్‌లో 45 మందికి ఆడిషన్స్ నిర్వహించి 15 మందిని ఎంపిక చేయగా, వారిలో ఏడుగురు హౌస్‌లోకి సామాన్యులుగా ప్రవేశించారు. కళ్యాణ్ పడాల విజేతగా, డెమాన్ పవన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!