

బిగ్‌బాస్ తెలుగు 10లో మరోసారి కెప్టెన్సీ చుట్టూ ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత టాస్క్‌లో ముఖేష్, అపూర్వ కలిసి ఆడి విజయం సాధించారు. అయితే వర్షిణి, టెంపర్ వంశీని ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ముఖేష్ తన కెప్టెన్సీ, అధికారాలను వదులుకున్నాడు. దీంతో ముఖేష్ స్థానంలో కెప్టెన్ బ్యాడ్జ్‌ను అపూర్వకు అందించారు నాగార్జున. అలా అపూర్వ ఈ వారం కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అపూర్వ తన అధికారాన్ని ఉపయోగించడం ప్రారంభించినట్లు డే 22 ప్రోమో 1లో కనిపిస్తోంది. ఇంటి సభ్యులకు ఏ పనులు కేటాయించాలనే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖేష్‌తో ఆమెకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ముఖేష్ ఏ పని చేస్తారని అపూర్వ ప్రశ్నించగా, డిష్ వాష్ చేస్తానని చెప్పినట్లు ప్రోమోలో ఉంది. తన మాటలను పట్టించుకోవడం లేదని అపూర్వ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను ఎందుకు తగ్గించుకోవాలని ముఖేష్ ప్రశ్నించగా, కెప్టెన్‌గా తన సూచనలు పాటించాల్సిందేనని అపూర్వ స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో పాటు త్రిగుణ్తోనూ కెప్టెన్ అపూర్వకు విభేదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రోమో సూచిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!