

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేష్ రెడ్డి.. కొద్దిసేపటికే తన బిగ్ బాస్ ప్రయాణాన్ని ముగించుకున్నారు. హౌస్‌లోకి కొత్తగా వచ్చిన ముగ్గురు కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున ప్రత్యేక ఆఫర్ ఇచ్చారు. రూ.15 లక్షలు తీసుకుని వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం కల్పించారు. మిగతా కంటెస్టెంట్లు ఈ ఆఫర్‌ను తిరస్కరించి ఆటను కొనసాగించాలని నిర్ణయించుకోగా.. మిథిలేష్ మాత్రం రూ.15 లక్షల ఆఫర్‌ను అంగీకరించి బయటకు వచ్చేశారు.
దీంతో మిథిలేష్ నిర్ణయం హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇంత తక్కువ సమయంలోనే షో నుంచి నిష్క్రమించడం ఆసక్తిని రేకెత్తించింది. మరోవైపు, మిథిలేష్ ఇప్పటికే డబ్బులు తీసుకుని బయటకు వెళ్లడంతో ఈ వారం రెగ్యులర్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఈ వారం ఎలిమినేషన్‌ను రద్దు చేసే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తుండగా.. మరోవైపు నిర్వాహకులు మరో ట్విస్ట్ ఇచ్చి ఇంకొక కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!