

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 10’కు సంబంధించిన సందడి ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 6న గ్రాండ్ ప్రీమియర్‌తో ఈ సీజన్ ప్రారంభం కానుండగా, సెప్టెంబర్ 7 నుంచి రోజువారీ ఎపిసోడ్‌లు ప్రసారం కానున్నాయి. అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. సోషల్ మీడియా, మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్, కస్తూరి, ఇంద్రనీల్, వాసుకి ఆనంద్, మహేష్ ఆచంట, బమ్ చిక్ బబ్లూ, ఎక్స్‌ప్రెస్ హరి, రాకింగ్ రాకేష్, పండు మాస్టర్, చంద్రహాస్, తేజస్విని గౌడ తదితరుల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ పేర్లపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ‘అగ్నిపరీక్ష 2’ ఆగస్టు 15 నుంచి జియోహాట్‌స్టార్, స్టార్ మాలో డిజిటల్ ప్రీ-షోగా ప్రారంభమైంది. 15 మంది షార్ట్‌లిస్ట్ అయిన సామాన్యులు వివిధ శారీరక, మానసిక సామర్థ్యాలను పరీక్షించే టాస్కుల్లో పాల్గొంటున్నారు. నవదీప్, అభిజీత్, బిందుమాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ పోటీలో విజేతలు నేరుగా హౌస్‌లోకి వెళ్తారా? లేక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కంటెస్టెంట్ల జాబితాను ముందుగానే చూడకుండా, హౌస్‌లోనే వారిని నేరుగా కలుసుకోవాలని నాగార్జున చెప్పినట్లు సమాచారం. అలాగే అనుచిత ప్రవర్తనను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ‘10X సర్‌ప్రైజ్‌లు, 10X డ్రామా, 10X ఛాలెంజ్‌లు’ అనే కాన్సెప్ట్‌తో ‘దశావతారం’ థీమ్‌లో ఈ సీజన్‌ను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆడిషన్స్‌లో మెప్పించిన ఆర్జే చరణ్ వంటి పలువురు టాప్ 15కు చేరుకోగా, ఆడిషన్స్‌లో తిరస్కరణకు గురైన ఉప్పల్ బాలు చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!