

బిగ్ బాస్ విజేత కళ్యాణ్ పడాల నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ముందుకు సాగుతున్నారు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత నటనపై దృష్టి పెట్టిన ఆయన, సినిమాల్లోకి రావాలనే లక్ష్యంతో ఆర్మీ ఉద్యోగాన్ని పక్కన పెట్టారు. విజేతగా నిలిచిన తర్వాత కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు, ఈవెంట్లలో కనిపించిన కళ్యాణ్.. తాజాగా సినిమాలపై ఫోకస్ పెంచారు. ఇప్పటికే ‘ఫన్’ అనే విభిన్నమైన టైటిల్‌తో తన తొలి సినిమాను ప్రారంభించారు.
తాజాగా తన రెండో సినిమాకు సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ చిత్రంతో ఎలెవన్ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు వెల్లడించారు. ఇది తనకు రెండో సినిమా కాగా, ఆ నిర్మాణ సంస్థకు తొలి చిత్రమని కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త విజన్‌తో మరో సినిమాటిక్ జర్నీ ప్రారంభమవుతోందని, ప్రేక్షకులకు చెప్పాల్సిన ఓ కథతో తమ ప్రయాణం మొదలవుతోందని తన పోస్ట్‌లో తెలిపారు. ఈ అప్డేట్పై బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ అభినందనలు తెలియజేయగా, అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమా టైటిల్, ఇతర వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!