

బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభమైన కొద్ది రోజులకే షోలో వరుసగా కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. తొలి వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్లు, రెండో వారంలో ఎలిమినేషన్, మూడో వారంలో రీ-ఎంట్రీ వంటి పరిణామాల తర్వాత.. ఇప్పుడు సాధారణ వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు ముందే ‘ఫైర్ కార్డ్స్’ పేరుతో కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విధానం ద్వారా సుమారు ఆరుగురు హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అగ్నిపరీక్ష విభాగం నుంచి మిథిలేష్, అపూర్వ, ఆర్కే పేర్లు వినిపిస్తుండగా.. సెలబ్రిటీల నుంచి నటరాజ్ మాస్టర్ భార్య నీతు పేరు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆరుగురి పూర్తి జాబితాపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
బయట నుంచి మూడు వారాల గేమ్‌ను గమనించిన కొత్త కంటెస్టెంట్లకు హౌస్‌లో ఎవరు బలమైన ఆటగాళ్లు, ఎవరి వైపు ప్రేక్షకుల మద్దతు ఉంది, ఎవరు విమర్శలు ఎదుర్కొంటున్నారు అనే విషయాలపై కొంత అవగాహన ఉండే అవకాశం ఉంది. దీంతో వారి ఎంట్రీ తర్వాత ఇప్పటికే ఉన్న కంటెస్టెంట్లతో కొత్త సమీకరణాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా సీజన్‌లో కొంతకాలం తర్వాత వచ్చే 2.0 లేదా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని సమాచారం. ఈ నేపథ్యంలో ‘ఫైర్ కార్డ్స్’ ఎంట్రీలు నిజమైతే మూడో వారంలోనే బిగ్ బాస్ హౌస్ గేమ్ మరింత మారే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!