

బిగ్ బాస్ తెలుగు 10 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలో జబర్దస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ కమెడియన్ కెవ్వు కార్తీక్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ టాక్ షోలో యాంకర్.. యూకే నుంచి ఇండియాకు మరో హౌస్‌లోకి వెళ్లేందుకే వచ్చారంటూ పరోక్షంగా ప్రశ్నించగా, కార్తీక్ ఆశ్చర్యంగా స్పందించడం ఈ వార్తలకు మరింత ఆసక్తిని పెంచింది. అయితే ఆయన బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న తన స్నేహితులు వర్షిణి, వంశీ, ఆటో రాంప్రసాద్, పొట్టి నరేష్ బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు కార్తీక్ తెలిపారు. తన అంచనా ప్రకారం పొట్టి నరేష్ టాప్-5లో ఉండొచ్చని, ఈ సీజన్‌లో జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను వైల్డ్ కార్డ్‌గా హౌస్‌లోకి వెళ్తే మాత్రం ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో ఆడతానని సరదాగా వ్యాఖ్యానించారు. అలాగే అగ్నిపరీక్ష ద్వారా హౌస్‌లోకి వచ్చిన కామనర్స్ ఆటతీరును ప్రశంసించారు. కెవ్వు కార్తీక్ నిజంగానే బిగ్ బాస్ తెలుగు 10లో వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇస్తారా లేదా అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!