

దాదాపు 22 ఏళ్లుగా బాలీవుడ్ సెలబ్రిటీల సరదా ముచ్చట్లకు వేదికగా నిలిచిన ప్రముఖ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’కు ఎండ్‌కార్డ్ పడనుంది. కార్యక్రమ వ్యాఖ్యాత, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ విషయాన్ని భావోద్వేగ వీడియో ద్వారా వెల్లడించారు. 2004లో ఈ షోను ప్రారంభించాలనే ఆలోచనను తన తండ్రి యశ్ జోహార్‌తో పంచుకున్నానని, ఆయన మరణానికి ముందు తాను చర్చించిన చివరి ప్రాజెక్ట్ ఇదేనని కరణ్ గుర్తుచేసుకున్నారు. ఎన్నో వివాదాలు ఎదురైనా ఈ షోకు ప్రేక్షకాదరణ మాత్రం కొనసాగిందని తెలిపారు.
తొమ్మిదో సీజన్ ‘కాఫీ విత్ కరణ్’కు చివరి సీజన్ కానుందని కరణ్ వెల్లడించారు. అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఇది ప్రసారం కానుంది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఎనిమిది సీజన్లు, 161 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. ప్రభాస్, రానా దగ్గుబాటి, ఎస్.ఎస్. రాజమౌళి, సమంత, విజయ్ దేవరకొండ వంటి పలువురు తెలుగు ప్రముఖులు గతంలో ఈ షోలో పాల్గొన్నారు. చివరి సీజన్‌లో అల్లు అర్జున్‌తో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లు కూడా కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!