

బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ విజేత పల్లవి ప్రశాంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ప్రైజ్‌మనీ, కారు, నెక్లెస్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీలో రూ.15 లక్షలు ప్రిన్స్ యావర్ సూట్‌కేస్ ద్వారా తీసుకెళ్లడంతో తనకు రూ.35 లక్షలు మాత్రమే వచ్చాయని తెలిపారు. అందులో 40 శాతం జీఎస్టీగా రూ.14 లక్షలు, కారు కోసం రూ.8.5 లక్షలు, నెక్లెస్ కోసం రూ.5 లక్షలు మినహాయించారని, చివరకు తనకు సుమారు రూ.7.5 లక్షలు మాత్రమే మిగిలాయని పేర్కొన్నారు. గిఫ్ట్‌గా ప్రకటించిన కారు, నెక్లెస్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు.
అయితే గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. బిగ్‌బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు తాను సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని పేదలకు, విద్యార్థులకు సాయం చేస్తున్నానని, చేసిన సాయానికి సంబంధించిన వివరాలను బయటపెట్టడం తనకు ఇష్టం లేదని అప్పట్లో చెప్పారు. దీంతో తాజాగా చేసిన వ్యాఖ్యలు, గతంలో చెప్పిన విషయాల మధ్య వ్యత్యాసం కనిపిస్తోందని చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ ఆరోపణలపై బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి అధికారిక వివరణ రావాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!