

2027 వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. కేప్‌టౌన్ వేదికగా ఐసీసీ, క్రికెట్ సౌత్ ఆఫ్రికా సంయుక్తంగా టోర్నీ వివరాలను ప్రకటించనున్నాయి. మ్యాచ్‌ల షెడ్యూల్‌తో పాటు టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను కూడా వెల్లడించే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
2027 ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొనేలా ఫార్మాట్ రూపొందించారు. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేకు నేరుగా అర్హత లభించనుండగా, మిగిలిన జట్లు ఐసీసీ అర్హత ప్రక్రియ ద్వారా బెర్త్‌లు సాధించనున్నాయి. మిగిలిన స్థానాలను క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా భర్తీ చేయనున్నారు. సెమీఫైనల్స్‌కు ముందు పలు దశల్లో పోటీ జరగనుండగా, గ్రూప్ దశ అనంతరం సూపర్ సెవెన్ దశలో కీలక పోటీలు కొనసాగుతాయి. అనంతరం టాప్ జట్లు సెమీఫైనల్స్, ఫైనల్‌లో తలపడతాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!