
సినిమాలు

దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి ఐదు సీజన్లు గడిచినా ఆయన పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 184 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ మొత్తం 25 సార్లు మ్యాచ్‌లో ఉత్తమ ఆటగాడి పురస్కారాన్ని అందుకొని టోర్నీ చరిత్రలో అగ్రస్థానంలో నిలిచారు.
ప్రస్తుతం ఆడుతున్న స్టార్ క్రికెటర్లు కూడా ఈ రికార్డును అధిగమించలేకపోయారు. రోహిత్ శర్మ ఖాతాలో 21 మ్యాచ్‌లో ఉత్తమ ఆటగాడి పురస్కారాలు ఉండగా, విరాట్ కోహ్లీ 20 సార్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. మ్యాచ్‌ల గమనాన్ని ఒంటిచేత్తో మార్చగల సామర్థ్యం ఏబీ డివిలియర్స్‌ను ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ విజేతల్లో ఒకరిగా నిలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!