
జనరల్

మలేషియాలో జరిగిన స్ట్రైక్ ఏషియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఛాంపియన్‌షిప్లో భారత ఫైటర్ సంగ్రామ్ సింగ్ అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచారు. ఫైనల్లో పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ ఆబిద్ అలీపై కేవలం 80 సెకన్లలోనే నాకౌట్ విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. తన వేగం, శక్తి, నైపుణ్యంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పోరును ముగించారు.
ఈ చారిత్రాత్మక విజయాన్ని సంగ్రామ్ సింగ్ భారత ప్రజలకు అంకితం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత జెండాను రెపరెపలాడించిన ఆయన విజయంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గెలుపు భారత మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మరో గర్వకారణంగా నిలిచింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!