
జనరల్

ఇంగ్లండ్ పర్యటనలో తొలి విజయాన్ని అందుకున్న టీమ్ ఇండియా, తొలి వన్డేలో అద్భుతమైన సమష్టి ప్రదర్శనతో ఆతిథ్య జట్టును ఓడించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమానంగా రాణించిన భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో పాటు అజేయంగా 57 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఈ ప్రదర్శనతో అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. విదేశీ గడ్డపై ఒకే వన్డేలో 50కి పైగా పరుగులు చేసి నాలుగు వికెట్లు తీసిన మూడో భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్, హార్దిక్ పాండ్య సరసన చేరాడు. అలాగే ఇంగ్లండ్‌పై భారత్ వరుసగా ఆరో వన్డే విజయం నమోదు చేసింది. 2015 తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌కు ఇది తొలి వన్డే పరాజయం కాగా, రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లీ అర్ధశతకం చేయకుండానే 250కి పైగా లక్ష్యాన్ని ఛేదించడం భారత్‌కు 2016 తర్వాత రెండోసారి కావడం విశేషం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!