

నార్వే ఫుట్‌బాల్ సమాఖ్య 2026 ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో ఇజ్రాయెల్‌తో జరిగే మ్యాచ్ టికెట్ అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తం లాభాలను గాజాలోని మానవతా సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సమాఖ్య తన బడ్జెట్ నుంచి అదనపు నిధులు, ఓ అజ్ఞాత దాత అందించిన విరాళాన్ని కలిపి సుమారు 4.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్లు సమీకరించింది. ఈ నిధులను గాజాలో అత్యవసర వైద్య సేవల కోసం డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థకు అందజేయనున్నారు.
ఎన్‌ఎఫ్‌ఎఫ్ అధ్యక్షురాలు లిసే క్లావెనెస్ మాట్లాడుతూ, గాజాలో నెలకొన్న మానవతా సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అమాయక ప్రజల బాధల పట్ల తాము మౌనంగా ఉండలేమని పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. చాలామంది దీనిని మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయంగా స్వాగతించగా, కొందరు ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అధికారులు 2023 అక్టోబర్ 7 దాడుల్లో బాధితుల పట్ల కూడా సమాన దృష్టి అవసరమని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!